Thursday, November 22, 2007

ప్రేమ కధ మొదలయింది..(part -2)



పట్టు పరికిణిలో,
బంగారు మేనిఛాయతో,
హరివిల్లుతొ పోటిపడుతూ,
మరు మల్లెల మృదుత్వాన్ని గుర్తు చేస్తూ..
వెన్నెల శిల్పంలా,
కొండపల్లి బొమ్మలా,
నేల దిగిన దేవ కన్యలా,
కదిలింది తను శ్రీవారి దర్శనానికి.....
అమ్మ కి ఇచ్చిన మాటైన మరచి,
నా అడుగులు తన వైపుగా పడుతుంటే..
కలలొ ఉన్నట్లుగ ఇలలో అలా తనను అనుసరించాను.

ఫరిహసమాడిన మిత్రురాలితొ చిరు కొపం ప్రదర్శిస్తే,
సత్యభామకు స్వయనా మేనత్త కూతురెమో అనిపించింది.
వన్నెల చిన్నది వొణిలొ హోయలు వొలుకిస్తే,
శ్రుతి తప్పి, నా గుండ సరాగాలు పలికింది.
ఛిరు నవ్వులు ఒలకపొసినప్పుడు,
దొసిలి పట్టి ముత్యాలు పట్టలెకపొయనే అని భాధ కలిగింది.
గుడి గంటలను తను సవ్వడి చెయ్యగా..
నా గుండెలొ ప్రతిధ్వనించి...
పరవశమై తనువంతా
పరిభ్రమించినది.

కనుసన్నల నను గమనించిన వైనం చూసి..
జన నెరజాణ అని తెలిసి,
చిరు మందహసమే నా సమధానమై నిలచింది.
ఒర కంటనే అది చూసి, సత్యభామ రూపు దాల్చి,
వెంకటేశ్వరుని వైపు మరలింది..
కనులు మూసి కమలనాధుని కోరవలిసిన కోరికలెవో కోరసాగింది.

1 comment:

  1. చాల బాగుంది....ఇలగే పోస్ట్ చేస్తూ ఉండు

    ReplyDelete