
ఉరుకు పరుగున చేరాను శ్రీనివాసుని సన్నిధి,
అలసినానెమో, ఎగిసి ఎగిసి పడుతొంది నా ఊపిరి,
అణువణవూ గాలించాయి నా కనులు నా అనుమతయినా మరిచి,
తను కానరాక, కనులు వడలి కన్నీరు జారింది,
సర్వాంగ సుందరుడు అయిన చిద్విలాసుని వైపు నా చూపు మరలింది,
తన జ్ఞాపకాల దొంతర లొ మొదటి పేజిని గుర్తుకు తెచ్చింది....
ఒక నాడు, అమ్మ మొక్కిన మొక్కును తీర్చుకుందామని ప్రదక్షిణలు చేస్తున్న నాకు,
చిరునవ్వుల చిరుసవ్వడి చెవిని తాకింది,తల తిప్పి చూడగా......
అందానికి నిర్వచనంలా,
అణుకువకు ప్రతిరూపంలా,
అరవిరసిన ముద్దమందరంలా,
అప్సరస ఎమో అనిపించెలా,
అపూరూప ఆ సుందర సౌరుప్యమును గాంచి...
కనులు చెమర్చి,
మనసు తనకు దాసొహమైనది,
శ్రీదేవి అయి తను నా హ్రుదయ పీఠమును అలకరించింది.
అలా ప్రేమ కధ.. నా ప్రేమ కధ మొదలయింది..
........ To be continued in next posts...
No comments:
Post a Comment